Minister Appalaraju | శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల కాలంలో ఒక్క పోర్ట్, ఒక్క హార్బర్ శంకుస్థాపన చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఇది నిరూపిస్తే రాజకీయాలు విడిచిపెట్టేస్తా అంటూ.. మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చిద్దామా? దమ్ముంటే అచ్చెన్నాయుడు చర్చకు రా? అంటూ మంత్రి సీదిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మంత్రి సీదిరి వ్యాఖ్యలకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి మరి.