Power Issue in Children’s Hospital | ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో కరెంట్ కష్టాలు కొలువుదీరాయి. బాలింతల వార్డులో విద్యుత్ సదుపాయం లేక పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలకు కరెంట్ అత్యంత అవసరమని.. వెంటిలేషన్, ఇంకా మిగితా అన్ని పరికరాలు కరెంట్ ఆధారంగానే పనిచేస్తాయని రోగులు వాపోతున్నారు. కరెంట్ లేకుంటే ప్రాణానికే ప్రమాదం అని ఆందోళన చెందుతున్నారు. గంటల తరబడి కరెంటు కోతపై రోగులు తల్లడిల్లుతున్నారు. ఇన్ని గంటలుగా కరెంట్ పోయినా.. ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని ఆవేదన వెల్లడిస్తున్నారు. ఆసుపత్రిలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా సరిగా ఉండదా అని నిలదీస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.