వివేకా హత్య కేసులో అరెస్టు అయిన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల కస్టడీ పిటిషన్ పై నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. వారిద్దరిని ఆరు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్ర 5గంటల వరకే విచారించాలని ఆదేశించింది. దీంతో రేపటి నుంచి ఈ నెల 24వరకు ఇద్దరిని సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. కాగా వివేకా హత్య కేసులో వీరి పాత్ర ఉందని సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.