హైదరాబాద్ మరో సాఫ్ట్ వేర్ కంపెనీ చేతులెత్తేసింది. గచ్చిబౌలిలో ఇన్సోఫి ఎడ్యుకేషనల్ లిమిటెడ్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ మేరకు కంపెనీ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వారికి మెయిల్ ద్వారా సమాచారం అందించింది. దీంతో ఉద్యోగులు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మొత్తం 700మంది పనిచేస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. 650మంది ఉద్యోగుల పేరుతో రూ.4లక్షలు, మరో 50మంది పేరుతో రూ.10లక్షలు చొప్పున రుణాలు తీసుకుందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.