బీఆర్ఎస్ పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొన్నానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) తెలిపారు. కేవలం మాటలే చెప్పే కేసీఆర్ ను గద్దె దించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం ఉందికదా అని విర్రవీగే ప్రజాప్రతినిధుల సమయం అయిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరినీ కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని ఆయన ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో బానిసలుగా బతుకుతున్న ప్రజాప్రతినిధులు బయటకు రావాలని.. అందరం కలిసి పోరాటం చేద్దామని ఆయన ఆహ్వానం పలికారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.