మరో పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇరుక్కున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందకు రాహుల్‌పై కేసు, రెండేళ్లు జైలు శిక్ష విధించగా.. తాజాగా, మరో పరువునష్టం కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. విషయమేంటనే… ఇటీవల లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ వీర్ సావర్కర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా…ఇందుకు స్పందించిన సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్(Satyaki Savarkar) పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. నిరాధారంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి మండిపడ్డారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం అని.. ఈ వ్యాఖ్యలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సావర్కర్ సవాల్ విసిరారు.
Read Also: చీమలపాడు బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడిన పవన్ కళ్యాణ్
Follow us on: Youtube, Koo, Google News