ఖమ్మం జిల్లా(Khammam) కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన ఘోర ప్రమాదంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR).. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్రగాయాలు కావడంపై విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఎంపీ నామా నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ కి ఫోన్ చేసి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు.
Also Read: ఖమ్మం BRSలో ఘోర విషాదం.. ఇద్దరు కార్యకర్తలు దుర్మరణం
Follow us on: Youtube, Koo, Google News