Saleshwarm Jathara | దైవదర్శనానికి వెళ్లి ముగ్గురు భక్తులు అనంతలోకాలకు చేరారు. దేవుణ్ణి దర్శించుకుందామన్న తపనతో వెళ్లిన భక్తులను మృత్యువు కబళించింది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి అందాల నడుమ ఉన్న లోయలో కొలువైన లింగమయ్యను దర్శించుకోవడానికి కాలినడక అధిక సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. భక్తులు కిక్కిరిసిపోవడంతో ఊపిరాడక ఒక వ్యక్తి.. తొక్కిసలాటలో మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. గుండెపోటుతో మృతి చెందిన మహిళను అమన్‌గల్‌కు చెందిన విజయగా గుర్తించారు. మరో ఇద్దరు మృతులు నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్‌గా (32) గుర్తించారు.