Secunderabad Railway Station | దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తుంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ కేంద్రంగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను పునరుద్ధరిస్తుంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఇప్పటికే సికింద్రబాద్ రైల్వే స్టేషన్ లో పనులు అన్నీ చకచకా జరుగుతున్నాయి. 719 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పునరుద్ధరిస్తున్నారు. ఈ క్రమంలో మరిన్ని పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ(Modi) ఏప్రిల్ 8న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఈ పనులను సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలిస్తున్నారు. స్టేషన్ పూర్తిగా పునర్నిమితమవడానికి చేపట్టిన పనులన్ని వచ్చే రెండున్నరేళ్లలో పూర్తవనున్నట్లు తెలుస్తోంది. అద్భుత హంగులతో రూపుదిద్దుకున్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad Railway Station) ని చూస్తే రెండు కళ్ళు చాలవు. ఇది రైల్వే స్టేషన్ ఆ.. లేదంటే ఏదైనా టూరిస్ట్ ప్రదేశమని అనిపిస్తుంది. అన్నీ ఆధునిక సదుపాయాలు ప్రజానికులను దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. వీటిలో 4 అంతస్తుల్లో కారు పార్కింగ్, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలేటర్లు అందుబాటులోకి రానున్నాయి. నూతనంగా నిర్మితమౌతున్న ఈ రైల్వే నిర్మాణం 30 ఏళ్లకు సరిపడ వసతులతో నిర్మిస్తున్నారు.
Read Also: మీసం మెలేసి.. తొడగొట్టి.. చంద్రబాబుకు ధర్మాన సవాల్
Follow us on: Youtube, Instagram, Google News