తెలంగాణలో పేపర్ లీకేజీ బెడద వీడడం లేదు. ఎంతో కష్టపడి చదువుకుంటున్న విద్యార్థుల జీవితాలతో లీక్ రాయుళ్లు ఆటలాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్ష జరుగుతుండగానే పేపర్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాలకే తెలుగు ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. దీనిపై డీఈవో స్పందిస్తూ తమ జిల్లాలో ఎలాంటి పేపర్ లీక్ కాలేదని తెలిపారు. పేపర్ లీకేజ్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు, పోలీసులు లీకేజీ నిజమా? కాదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.