తెలుగు రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును నడపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ రైలు నడస్తుండగా.. తాజగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 8వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. అయితే ఆ రోజు ప్రయాణికులను అనుమతించరు. 9వ తేది నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. మంగళవారం తప్ప మిగతా రోజుల్లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు తిరగనుంది.
సికింద్రాబాద్-తిరుపతి(ట్రైన్ నెంబర్ 20701) సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. మధ్యలో నల్లగొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ ఆగనుంది. నల్లగొండకు ఉదయం 7.19గంటలకు, గుంటూరుకు ఉదయం 9.45గంటలకు, ఒంగోలుకు 11.08గంటలకు, నెల్లూరుకు మధ్యాహ్నం 12.29 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 20702) తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ సాయంత్రం 5.20 గంటలకు నెల్లూరు, 6.30కు ఒంగోలు, 7.45కు గుంటూరు, రాత్రి 10.10 గంటలకు నల్లగొండ చేరుకోనుంది.