Bandi Sanjay |తెలంగాణలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజెన్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్రంలో దాదాపు 23వేల మందికి పైగా ఉన్న వీరి సమస్యల పట్ల ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదంటూ లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్న బండి సంజయ్ .. ఎన్నిఇబ్బందులున్నా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. 1999 నుంచి 2004 వరకు విద్యుత్ సంస్థల్లో నియమితులైన వారికి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలన్న ఆయన.. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్లు న్యాయపరమైనవని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: నేడు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ
Follow us on: Youtube , Instagram