Gold| సాధారణంగా బోరు బావి నుంచి నీరు రావడం చూశాం.. కానీ అక్కడ నీరుతో పాటుగా బంగారం కూడా వస్తుంది. ఆశ్చర్యంగా ఉందా..? మీరు విన్నది నిజమే. వ్యవసాయం చేయడానికి ఓ రైతు తన పొలంలో బోరువేయగా.. ఆ బోరునుండి నీటితో పాటుగా బంగారం కూడా బయటపడింది. దీంతో స్థానికులంతా ఆ బోరుబావి వద్ద గుమిగూడారు. ఆశ్చర్య పరిచే ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
బలంగిర్ జిల్లాకు చెందిన మహమ్మద్ జావేద్ అనే రైతు.. తన పొలంలో బోరు భావి వేయగా.. అందులో నుండి పసులు రంగు బురద రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. చిన్న చిన్న ముక్కలు పసుపు రంగులో మెరవటం అక్కడివారు గమనించారు. ఈ విషయం కాస్త ఆనోటా ఈనోటా పాకడంతో ఊరంతా జనాలు ఆ బోరు భావి వద్దకు పరుగులు తీశారు. ఈ విషయంపై వెంటనే సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ నీటిని పరిశీలించారు. శాంపిల్ ను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. అయితే బోరునుండి వస్తున్న పసుపు రంగు ముక్కలు నిజంగా బంగారమా కాదా అన్న విషయం ఇప్పుడే చెప్పలేమని.. దీనిని శాస్త్రీయంగా పరీక్షించిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తుందని అధికారులు తెలిపారు.