Stress Relief |నేటి కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్యల్లో ఒత్తిడి ఒకటి. ఈ ఒత్తిడి కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారినపడుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒత్తిడిలోనూ ఎన్నో రకాలున్నాయి. పని ఒత్తిడి, చదువు ఒత్తిడి, కుటుంబ సమస్యల కారణంగా ఒత్తిడి ఇలా ఎన్నో రకాల ఒత్తిడిల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఒత్తిడిని జయించి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచుకోకపోతే అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఒత్తిడిని ఏయే మార్గాల్లో తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం.
Stress Relief |వ్యాయామం: ప్రతి రోజూ కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించడం మంచిది. అలా చేయడం ద్వారా అది మనస్సుకు విశ్రాంతినిస్తుంది. దానివల్ల మీ ఒత్తిడి దూరమవుతుంది. ఇందుకోసం వర్కవుట్, వాకింగ్, స్విమ్మింగ్ వంటివి చేయాలి.
శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుకోవాలి: ఒత్తిడిని తగ్గించడానికి మీ కండరాలకు విశ్రాంతినివ్వండి. దీని కోసం, మీరు స్ట్రెచింగ్, మసాజ్, రాత్రి మంచి నిద్ర మొదలైనవి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది.
లోతైన శ్వాస: ఒత్తిడికి గురవుతుంటే మీరు లోతైన శ్వాస తీసుకోవాలి. దీని కోసం, మీరు పడుకుని ధ్యానం చేయండి. లేదా కూర్చొని అయినా లోతైన శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఒత్తిడి దూరమవుతుంది.