వరంగల్: తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(MLA Rajaiah) కంటతడి పెట్టారు. కరుణపురంలో ఫాదర్ కొలంబో జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను రాజకీయంగా ఎదురుకునే దమ్ములేక కొందరు ప్రత్యర్థులు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారు దమ్ముంటే తనపై పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. కూతురుతో సమాన వయసున్న మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘనపూర్లో 5వ సారి కూడా భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని స్పష్టంచేశారు. కాగా కొన్నిరోజుల క్రితం జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీ అధిష్టానం ఆదేశాలతో నవ్య ఇంటికి వెళ్లిన రాజయ్య ఆమెకు క్షమాపణలు చెప్పారు.
Read Also: వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: కోటంరెడ్డి
Follow us on: Youtube Instagram