కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఈ నెల 14న జనసేన(Janasena) పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు దిశానిర్దేశం చేయనున్నారు. పవన్.. తన వారాహి వాహనంతో మచిలీపట్నంలో ఎంట్రీ ఇవ్వడం స్పెషల్ అక్ట్రాక్షన్ గా నిలువనుంది. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మచిలీపట్నం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఈ షెడ్యూల్ ప్రకారం… ఈ నెల 11న మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సదస్సులో పవన్ పాల్గొంటారు. ఈ నెల 12న కాపు ఉద్యమ నేత హరిరామజోగయ్య, కాపు నేతలు పవన్ కల్యాణ్ ను కలవనున్నారు. ఈ నెల 13న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పవన్ సమావేశం కానున్నారు. ఈ నెల 14న పార్టీ ఆవిర్భావ సభ కోసం పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్నారు. గతంలో మాజీ మంత్రి పేర్ని నాని.. పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన ఇలాకాలోనే జనసేన సభ జరుగుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి.. హైకోర్టుకు అవినాశ్ రెడ్డి
Follow us on: Youtube Instagram