తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కు ఉన్న ఫాలోయింగ్ మామూలు కాదు. తనదైన నటనతో తాతగారు నందమూరి తారక రామారావు చూపిన మార్గంలో నడుస్తూ.. తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటూ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్నాడు. దర్శకధీరుడు రాజమౌళితో తీసిన ‘RRR’ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నో అవార్డులను స్వంతం చేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం ఆస్కార్ బరిలో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ‘RRR’ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది.
తాజాగా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. తన అభిమానితో కాసేపు గడిపారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అమ్మకు మీరంటే ఇష్టం అన్నా.. ఒక్కసారి మాట్లడాడుతారా?’ అని అడగగానే ఎన్టీఆర్ అంగీకరించారు. చాలా సంతోషించిన అతను తన తల్లికి వీడియో కాల్ చేయగానే ఫోన్ తీసుకుని తారక్ ఒక కుటుంబ సభ్యుడిలా మాట్లాడటం అందర్నీ సంతోష పరుస్తుంది. ప్రస్తుతం వారి మధ్య గల సంభాషణ నెట్టింట వైరల్ అవుతోంది.