ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ హైకోర్టుకు కూడా వెళ్లడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపై జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిటిషన్ విచారణకు తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉందన్నారు. అభియోగాలు, బెదిరింపులతో జగన్ తనకు గతేడాది జూన్‌లో లేఖ రాశారని చెప్పారు. జగన్ చేసిన వ్యాఖ్యలను క్షమించి వదిలేస్తున్నానని స్పీకర్ అన్నారు.