కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌ను అర్థరాత్రి నియమించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కొత్త సీఈసీ ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించడం వల్ల సుప్రీంకోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. ముగ్గురు సభ్యుల ప్యానెల్ కమిటీలో తాను, ప్రధాని మోదీ, అమిత్ షా ఉన్నారని… ఇప్పుడేమో తనకు తెలియకుండా అర్థరాత్రి కొత్త సీఈసీని ప్రకటించేశారని ఆరోపించారు. ఈ చర్య మర్యాదలేనిదిగా ఉందని తెలిపారు. ఈ కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులొ విచారణ ఉండగా… కొత్త సీఈసీని ఎలా ప్రకటిస్తారని రాహుల్ గాంధీ నిలదీశారు.