సినీ నటుడు మంచు మనోజ్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. తిరుపతి జిల్లా భాకరాపేట పోలీస్ స్టేషన్‌లో మనోజ్ రచ్చ రచ్చ చేశారట. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆయన తన బౌన్సర్లనే ప్రశ్నిస్తారా.. అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
అసలు ఏం జరిగిందంటే.
భాకరాపేట సమీపంలోని ఓ రిసార్ట్‌లో మంచు మనోజ్ బస చేశారు. అర్ధరాత్రి భాకరాపేట ఎస్సై రాఘవేంద్ర మంచు మనోజ్ ఉన్న రిసార్ట్‌కు వెళ్లారు. అక్కడ మంచు మనోజ్ బౌన్సర్లు కనిపించడంతో .. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని బౌన్సర్లను ఎస్సై ప్రశ్నించారట. ఈ విషయం తెలుసుకున్న.. మంచు మనోజ్ ఆగ్రహంతో ఊగిపోయారు. మనోజ్ ఎస్సైతో వాగ్వాదానికి దిగారు.
నన్ను అరెస్టు చేయడానికి వచ్చారా? అంటూ పోలీసులతో మనోజ్ వాగ్వాదం పెట్టుకున్నారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు మనోజ్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు హై డ్రామా నడిచింది. కాసేపు పోలీస్ స్టేషన్ లోపల, బయట కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెబితే కాని తాను ఇక్కడి నుంచి కదలనని భీష్మించుకు కూర్చున్నారట. అర్ధరాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట దాకా పోలీస్ స్టేషన్ మెట్ల మీదే ఉన్నారట. అయితే పెట్రోలింగ్‌లో భాగంగానే రిసార్ట్‌కు వెళ్లామని పోలీసులు అంటున్నారు.
చివరకు పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్‌కి వచ్చి మనోజ్‌కు నచ్చజెబితే కానీ ఆయన అక్కడి నుంచి కదలలేదట.
ఆస్తి గొడవలు
గత కొంతకాలంగా మంచు కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ మధ్య ఆస్తుల కోసం కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ విషయంలోనే హైదరాబాద్‌లోని జల్‌పల్లి ఇంటి దగ్గర హైడ్రామా నడిచింది. తర్వాత సంక్రాంతికి తిరుపతిలో విద్యానికేతన్ దగ్గర కూడా మంచు మనోజ్ ఆందోళన చేశారు. తనకు విద్యాలయంలో హక్కు ఉందని మనోజ్ అంటున్నాడు. తండ్రీ, కుమారుడు పోలీసులకు పరస్పర ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. తన ఆస్తులు తనకు అప్పగించాలని మంచు మోహన్ బాబు కోరారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. జల్ పల్లి ఇంటి వివాదంపై రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. అటు జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబు ఇటీవలె సుప్రీంకోర్టు బెయిల్‌తో ఊపిరిపీల్చుకున్న సంగతి తెలిసిందే.