Nara Lokesh | ఏపీలో గంజాయి మాఫియా ఆగడాలపై ప్రధాని నరేంద్ర మోదీ(Modi)కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదుచేశారు. మోదీతో పాటు కేంద్ర హోం సెక్రటరీ అజయ్ భల్లా, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరక్టర్ జనరల్ కు కూడా ఈ ఫిర్యాదు లేఖను పంపారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకం విచ్చలవిడిగా జరుగుతోందని.. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలపై వచ్చిన వార్తా కథనాలను ఫిర్యాదుకు జతచేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పిల్లలు మత్తుకు బానిసై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.
గంజాయి మాఫియాలో వైసీపీ(YCP) నేతల ప్రమేయం ఉందని.. అందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(DRI) విడుదల చేసిన 2021-22 స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్టు ప్రకారం డ్రగ్స్ వినియోగంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. 2021-22 ఏడాదిలోనే 18వేల కేజీల నార్కోటిక్స్ సీజ్ చేశారని చెప్పారు. కందుకూరు, అనకాపల్లి ప్రాంతాలలోని స్కూలు పిల్లలు కూడా గంజాయి, డ్రగ్స్‌కి బానిసలయ్యారన్నారు.
తాను చేస్తున్న పాదయాత్ర యువగళం(Yuvagalam)లో భాగంగా గంజాయి కారణంగా తమ పిల్లల భవిష్యత్ దెబ్బతింటోందని తల్లిదండ్రులు ఫిర్యాదుచేస్తున్నారని వెల్లడించారు. అంతేకాకుండా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala) కొండపై కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని ఆరోపించారు. మాదకద్రవ్యాల ద్వారా సంపాందించిన డబ్బును హవాలా(Hawala) రూపంలో విదేశాలకు తరలించి మళ్లీ రాష్ట్రంలోకి తిరిగి తీసుకువస్తున్నారని లోకేష్ తెలిపారు. ఏపీలో మాదకద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్(Nara Lokesh)కోరారు.
Read Also: ఏపీలో పోటీ చేస్తా.. ఎవరు ఆపుతారో చూస్తా
Follow us on: Youtube