ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అక్కినేని ఫ్యామిలీ కలిసింది. శుక్రవారం పార్లమెంట్‌లో అక్కినేని కుటుంబ సభ్యులు.. నాగార్జున, నాగచైతన్య, శోభితా తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మన్‌కీ బాత్ కార్యక్రమంలో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్కినేని జీవిత చరిత్రను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.