పర్యాటక పాలసీ తీసుకువచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఎకో టూరిజం కింద త్వరలో వికారాబాద్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని పర్యాటక క్షేత్రాలు రావాల్సి ఉందన్న రేవంత్‌రెడ్డి…. వరితో పాటు వాణిజ్య పంటల ప్రోత్సాహానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. తెలంగాణను ప్రకృతివనంగా మార్చాల్సి ఉందన్నారు.. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామని తెలిపారు.. త్వరలో విధివిధానాలు ఖరారుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
ఎకో ఎక్స్ పీరియం పార్కును అద్భుతంగా తీర్చిదిద్దారని హీరో చిరంజీవి అన్నారు… మంచి టూరిజం స్పాట్ అవుతుందని తెలిపారు… వెడ్డింగ్స్, ఈవెంట్స్ కి అద్భుతంగా ఉంటుందన్నారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన చెట్లు బాగా ఆకట్టుకున్నాయన్నారు. ముఖ్యంగా వివిధ దేశాలనుంచి తెప్పించిన అద్బుత కళాఖండాలతో ఈ పార్స్‌ను తీర్చిదిద్దారని తెలిపారు.