నారా చంద్రబాబు నాయుడు తర్వాత మంత్రి లోకేషే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ లోకేష్ చేపట్టిన యువగళంకి వచ్చిందన్నారు. ఇక, నారా లోకేష్ వారసత్వ రాజకీయ నాయకుడు కాదని.. లోకేష్ ప్రజల్లో నుంచి ఎదిగిన నాయకుడిగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు, చంద్రబాబు తర్వాత లోకేష్ వారసుడు అని స్పష్టం చేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు లోకేష్ చేపట్టిన పాదయాత్రతో పార్టీ మళ్లీ గాడిలో పడిందన్నారు బుద్దా వెంకన్న.