17.7 C
Hyderabad
Wednesday, January 22, 2025
spot_img

ఐటీని పిలుస్తున్న సినిమా కలెక్షన్ల పోస్టర్లు

ఐటీ దాడులకు రమ్మని సినిమా వాళ్లే పిలుస్తున్నారా?.. కోట్ల కలెక్షన్లు వసూళ్లు చేస్తుంది అంటూ చేస్తున్న ప్రచారమే దాడులకు కారణమవుతుందా?.. లేనిపోని ఆర్భాటాలే నిర్మాతల కొంప ముంచుతుందా?.. అంటే అవుననే సమాధానం వస్తోంది.

సినిమా విడుదలకు ముందే వెయ్యి కోట్ల బిజినెస్‌ అంటూ యాంకర్‌ సుమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఆదాయపు పన్ను శాఖ వారిని రా రమ్మని పిలిచినట్టు ఉందని .. అందరూ గుసగుసలాడుకున్నారు. ఇలా అనౌన్స్‌ చేయడం సినీ నిర్మాతలకు ఇష్టం లేకపోయినా.. హీరో ఒత్తిడి మేరకు ఇలా తప్పడం లేదట.

దీనికి తోడు సినిమా రిలీజ్‌ అవ్వగనే.. ఫస్ట్‌ డే కలెక్షన్‌ ఎంతో తెలుసా?.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2 మొదటి రోజు కలెక్షన్లు.. బాహుబలిని దాటేసిన పుష్పరాజ్‌.. ఆ రికార్డులను బద్దలు కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం.. ఇలా ఆర్భాటాలు, ప్రచారాలకు పోతుంటారు. ఇవే నిర్మాతల కొంప ముంచుతున్నాయి. ఫ్యాన్స్‌ కోసం, ఇంకా కలెక్షన్లు పెరుగుతాయన్న ఆశతో ఇలాంటి ప్రచారాలు చేయిస్తుంటారు. నిజంగా ఇన్ని కలెక్షన్లు వస్తున్నాయో.. లేదో తెలియదు కానీ.. సినిమా యూనిట్ చేసే హడావుడి మాత్రం ఆదాయపు పన్ను శాఖ కంట్లో పడుతుంది. అందుకే వెంటనే ఐటీ శాఖ వారు వాలిపోతుంటారు. నిర్మాతలపై దాడి చేసి వివరాలు సేకరిస్తారు.

మంగళవారం ఉదయం నుంచే దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైనా రెయిడ్‌ చేసింది. హైదరాబాద్‌లో ఒకేసారి 8 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. 65 బృందాలుగా విడిపోయి పలు చోట్ల సోదాలు చేపట్టారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, మైత్రీ నవీన్, సీఈవో చెర్రి, మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. దిల్‌రాజు, శిరీశ్‌తో పాటు ఆయన కుమార్తె హన్సిత రెడ్డి ఇళ్లలోనూ రెయిడ్స్ అవుతున్నాయి. దిల్‌రాజు వ్యాపార భాగస్వాముల ఇళ్లల్లో కూడా ఐటీ తనిఖీలు జరుపుతోంది.

గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా ఉండగా… డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించాడు. మూడు సినిమాలు పెద్ద బడ్జెట్‌తో తీసినవే కావడంతో ఐటీ ఫోకస్ పెట్టింది. ఇక పుష్ప2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ సంస్థ, వ్యాపారుల ఇళ్లలోను ఐటీ సోదాలు చేపట్టాంది. పుష్ప 2 సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధించింది. వీరితో పాటు మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవి కనీసం నాలుగు రోజుల పాటు కొనసాగుతాయని తెలుస్తోంది.

Latest Articles

ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్…ప్రి ఎస్టిమేటెడ్ ప్లాన్ పై ఎన్నో ఆశలు, ఊహాగానాలు

ప్రీ ఎస్టిమేటెడ్ ప్లాన్, నిర్దిష్ట కాలానికి ఆదాయ వ్యయాల అంచనా, నిర్వచించిన కాలానికి జమలు,ఖర్చుల అంచనా, ఆదాయ వ్యయ ప్రణాళిక... ఇవన్నీ బడ్జెట్ నిర్వచనాలే. రాబోయే ఆర్థిక సంవత్సరానికి, గత ఏడాది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్