25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

హనీరోజ్‌కు వేధింపుల కేసులో పోలీసుల అదుపులో వ్యాపారవేత్త

మళయాళ నటి హనీ రోజ్‌కు వేధింపుల కేసులో కేరళలోని వ్యాపారవేత్త బాబీ చెమ్మనూరును సిట్‌ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతనిని కీలకంగా భావిస్తున్నారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత వాయనాడ్ నుంచి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు.

దీనిపై స్పందించిన హనీ రోజ్‌.. ఇది తనకు ప్రశాంతమైన రోజు అని అన్నారు. ఈ విషయం గురించి చెప్పినప్పడు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హామీ ఇచ్చారని చెప్పారు.

ఈ వారం ప్రారంభంలో సోషల్ మీడియా పోస్ట్‌లో.. తాను వేధింపులకు గురవుతున్నట్లు వివరించారు. కానీ ఆ పోస్టులో తనను వేధిస్తున్నవారి పేరు చెప్పలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అరెస్టు చేశారు.

వివరణాత్మక విమర్శలు, లుక్స్‌పై వేసే సరదా జోక్స్, మీమ్స్‌ను స్వాగతిస్తానని.. వాటిని తాను పెద్దగా పట్టించుకోనని హనీరోజ్‌ చెప్పారు. కానీ ప్రతిదానికీ ఓ హద్దు ఉంటుందని తాను నమ్ముతానని అన్నారు. అసభ్యకరంగా చేసే ఏ కామెంట్స్‌ని అయినా తాను సహించబోనని కూడా హనీ రోజ్‌ అన్నారు.

ఆభరణాల వ్యాపార సంస్థ చెమ్మనూర్‌ గ్రూప్‌కు బాబీ చెమ్మనూరు ఛైర్మన్‌గా ఉన్నారు. 2012లో ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనాను కేరళకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.

అతనిపై ఆరోపణల నేపథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. చెమ్మనూరును విచారించేందుకు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

Latest Articles

డ్యాన్స్ ను జయించిన క్యాన్సిల్…డామిట్ కథ అడ్డం తిరిగింది

నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవు, కలుసుకున్న ప్రతి రేయి, కార్తీక పున్నమి రేయి...కాపురం కొత్త కాపురం, నువ్వు నేను ఏకమైనాము, ఇద్దరమూ మన మిద్దరమూ ఒక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్