28.8 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

గనిలో చిక్కుక్కున్న కార్మికులు .. పెరుగుతున్న వరద నీరు

అస్సాం బొగ్గు గని ప్రమాదంలో తాజాగా ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఇక్కడి దిమా హసావ్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో ఇటీవల తొమ్మిది మంది కార్మికులు చిక్కుకున్నారు. దిమా హసావ్ జిల్లాకు మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఓ బొగ్గు గని 340 అడుగుల లోతున ఉన్నది. ఈ గనిలో ర్యాట్ హోల్ పద్ధతిలో బొగ్గును తీస్తుండగా, ఒక్కసారిగా వరదనీరు ప్రవేశించింది. దీంతో గనిలో ఉన్న తొమ్మిదిమంది కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. వీరిలో ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు తెలిసింది. వీరి మృతికి సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అధికారులు తెలియచేశారు. కాగా తాజాగా ఒక మృతదేహాన్ని వెలికి తీశారు.

మృతిచెందిన ముగ్గురిలో ఒకరు నేపాల్ చెందిన వ్యక్తి కాగా మరొకరు పశ్చిమ బెంగాల్ వాసి. ఇక మూడో వ్యక్తి అస్సాం వాసి. ఇదిలా ఉంటే, ఈ బొగ్గు గనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు. దీంతో అక్రమ గని పేరుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ర్యాట్‌ హోల్ మైనింగ్ పై అస్సాం ప్రభుత్వం 2014లో నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల కళ్లుగప్పి ర్యాట్ హోల్ పద్ధతిలో బొగ్గును అక్రమంగా తవ్వుతున్నారు. అస్సాం సహా అనేక ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా అక్రమ బొగ్గు తవ్వకాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి.

బొగ్గు గనిలోపల వంద అడుగుల మేర నీటి మట్టం పెరిగినట్లు అధికారుల అంచనా. దీంతో గనిలోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి ఆర్మీ, నేవీకి చెందిన బృందాలు పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. రెస్యూ టీమ్‌నకు గనిలోపల మృతదేహాలు కనిపించాయి. అయితే గనిలోపల నీరు ఎక్కువా ఉండటంతో మృతదేహాల దగ్గరకు రెస్యూ టీమ్‌ వెళ్లలేకపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.

కాగా బొగ్గు గనిలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురావడానికి విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళానికి చెందిన డైవర్ల సాయం తీసుకుంటున్నారు. విశాఖ నుంచి హుటాహుటిన వచ్చిన డైవర్లు వెంటనే తమ పని ప్రారంభించారు. గనిలోని నీటిని తోడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గనిలోకి డీ వాటరింగ్ పైపులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే…ఈశాన్య రాష్ట్రాల్లోని బొగ్గు గనుల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 2019 లో మేఘాలయలో కూడా ఇటువంటి ప్రమాదమే సంభవించింది. గనిలో కొంతమంది కార్మికులు పనిచేస్తుండగా, సమీపాన ఉన్న నది నుంచి భారీగా నీరు వచ్చింది. దీంతో గని అంతా నీటితో నిండిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది జలసమాధి అయ్యారు. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలో 2024 జనవరిలో ‘ర్యాట్ హోల్’ గనిలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించారు.మొత్తంమీద బొగ్గు గని దుర్ఘటనతో దిమా హసావ్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్