25.6 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

ములుగు జిల్లాలో పర్యాటక వెలుగు జిలుగులు

ములిగే పరిస్థితి తలెత్తినప్పుడు ఏం చేయాలి..? వెంటనే తేల్చడానికి ప్రయత్నించాలి. ప్రాబ్లెం ఏమీ లేకుండా పరిస్థితి హాయిగా ఉన్నప్పుడు ఏం చేయాలి..? మరింత అభివృద్దికి బాటలు వేయాలి. ఆర్థిక పురోగతి సాధించాలి. అందరితో శభాష్ అనిపించుకోవాలి. ఇప్పుడు ఈ కితాబులు, ప్రశంసలు, శభాష్ లు అన్ని ములుగు జిల్లా సాధిస్తోంది. పర్యాటక వెలుగు జిలుగులతో ములుగు శోభిల్లుతోంది.

పచ్చని ప్రకృతి, గల గల పారే సెలయేర్లు, కనువిందు చేసే తరువులు, చెంగు చెంగున దూకే సాధు జంతువులు, భీకర గర్జనలు చేసే క్రూర జంతువులు…ఇవన్నీ కలిస్తే అటవీ ప్రాంతం అవుతుంది. ఆ సుందర వనాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే గొప్ప పర్యాటక ప్రాంతం అవుతుంది. ములుగు జిల్లా గోవిందరావుపేట, తాడ్వాయి మండలం లక్నవరం చెరువులో కొంత ప్రాంతాన్ని పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది. ఓ ప్రైవేట్ కంపెనీతో చేయి చేయి కలిపి ఈ అభివృద్దికి పాటుపడింది. ఈ ప్రాంతానికి మూడో దీవి, థర్డ్ ఐలాండ్ అని పేరు పెట్టింది. అయిదేళ్లకు దీనిని లీజు పొందిన ప్రైవేట్ కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలతో థర్డ్ ఐలాండ్ ను తీర్చిదిద్దింది. లక్నవరం చెరువులో 12 ఎకరాల మేర ఈ అభివృద్ధి జరిగింది.

లేక్ వ్యూ కాటేజ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ గేమ్స్, బోట్ రైడింగ్, ఇసుక తిన్నెల్లో గుడారాలు, రెస్టారెంట్లతో.. దట్టమైన తాడ్వాయి అటవీ ప్రాంతంలో బ్రహ్మాండమైన పర్యాటక ప్రదేశాన్ని అధికారులు సిద్ధం చేశారు. సముద్ర తీర పర్యాటక ప్రాంతాల మాదిరి బీచ్ పర్యాటక స్థలిగా..ఈ అటవీ పర్యాటక ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. బ్లాక్ బెర్రీ ఐలాండ్ గా పేరొందిన ఈ ప్రాంతంలో జలగలంచ వాగు వడ్డున ఇసుక తిన్నెలు, కొండల మాదిరి ఉన్న ఎన్నెన్నో ఎత్తయిన చెట్లు దర్శనమిస్తున్నాయి.

సంపూర్ణంగా ఎకో ఫ్రెండ్లీ వేలో దర్శనమిస్తున్న ఈ అటవీ పర్యాటక ప్రాంతంలో.. వెదుర కర్రల మంచెలు, గుడారాలు, ఇసుకలో క్రీడాప్రాంతం, సెల్ఫీ పాయింట్లు సైతం ఏర్పాటు చేశారు. గ్రేట్ గోవా సాగర తీరం మాదిరిగా టాప్ లైటింగ్ తో సుందరంగా అలంకరించారు.

ట్రెకింగ్, బర్డ్ వాచ్, సఫారీ రైడింగ్ కోసం సైతం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వాజేడు మండలంలోని బొగత జలపాతం, మేడారం, మల్లూరు, రామప్పలను పర్యాటకంగా అభివృద్ది చేయడానికి పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఏడాది పొడువునా సందర్శకులు దర్శనమిచ్చే గొప్ప ప్రాంతంగా దీన్ని తీర్చి దిద్దాలని పాలకులు, అధికారులు ఆలోచనలు సాగిస్తున్నారు.

గత మూడేళ్లలో ములుగు జిల్లాకు కోటిన్నర మందికి పైగా పర్యాటకులు వచ్చారంటే ఈ ప్రాంతం ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో తెలుసుకోవచ్చు. రామప్ప, లక్నవరం, మేడారానికి కోట్ల రూపాయల ఆదాయం లభించింది. పర్యాటకంగా ఇంత అభివృద్ధి చెందడంతో.. కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రోత్సాహం అందించాలని భావించింది. ప్రత్యేక నిధుల కేటాయింపునకు ముందుకొచ్చింది.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రామప్ప ప్రాంత పర్యావరణ హిత పర్యాటక కార్యక్రమం కింద 73.74 కోట్ల రూపాయల నిధుల కేటాయింపు జరిగినట్టు సమాచారం.

Latest Articles

ఆటో డ్రైవర్ తో గొడవ పడిన రాహుల్ ద్రావిడ్… వీడియో వైరల్

దిగ్గజ ఇండియన్‌ క్రికెటర్‌, మాజీ ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ .. బెంగళూరు వీధిలో ఆటో రిక్షా డ్రైవర్‌తో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్