14.2 C
Hyderabad
Tuesday, January 7, 2025
spot_img

అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పని చేయడం మానుకోండి- మంత్రి అనగాని

రెవెన్యూ సమస్యలు పరిష్కరించడంలో ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. మంగళగిరి సీసీఎల్ఎ కార్యాలయంలో ప్రాంతీయ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 12 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఉప సభాపతి రఘురామక్రిష్టంరాజు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, కామినేని శ్రీనివాస్, వసంత క్రిష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ రామరాజు, రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా, సీసీఎల్ఎ జయలక్ష్మీ హాజరయ్యారు.

రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అన్నారు. ఇప్పటి వరకు పరిష్కరించిన అర్జీల్లో సగం మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22ఎ సమస్యకే ఇంత వరకు అధికారులు పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల అర్జీలను పరిష్కరించడంలో మొక్కుబడిగా పని చేయడం మానుకోవాలన్నారు. పరిష్కరించగలిన అర్జీలను కూడా సకాలంలో పరిష్కరించడం లేదని మండిపడ్డారు. దీనిపైన సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారు. పరిష్కరించిన అర్జీలపై ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై జిల్లా స్థాయిలోనూ అర్జీదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని అధికారులకు మంత్రి అనగాని సూచించారు.

స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోదియా మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ పనితీరుపై చాలా అసంతృప్తి ఉందన్నారు . రెవెన్యూ శాఖకి ప్రస్తుతం సర్జరీ అవసరమన్నారు. రెవెన్యూ ఉద్యోగులు ట్రేడ్ మిల్ పైన పరిగెడితున్నట్లు ఉన్నారే కానీ.. .గమ్యం మాత్రం చేరడం లేదని సిసోదియా కామెంట్ చేశారు.

Latest Articles

చైనాలో HMPV కలకలం.. భారత్ లో పెరుగుతున్న కేసులు..

చైనాలో HMPV కలకలం సృష్టిస్తోన్న వేళ.. భారత్‌లోనూ ఆ వైరస్‌ను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో ఐదు HMPV కేసులు నమోదవగా.. కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్