కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడవుతున్నాయి. తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఈ ఫలితాల్లో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం 60వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి నవ్యహరిదాస్ ఆ స్థానంలో పోటీలో ఉన్నారు. వయనాడ్‌లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.6 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాహుల్ రాజీనామాతో ప్రియాంక రంగంలోకి దిగారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ రికార్డు విజయం నమోదుచేసేలా కనిపిస్తున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభం అయినప్పటి నుంచే ఆమె లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు తన సమీప ప్రత్యర్థి సీపీఐ క్యాండిడేట్ సత్యన్ మెకేరిపై 68 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఆమెకు దరిదాపుల్లో కూడా నిలువలేకపోయారు.