టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నాస్తికుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. విగ్రహాలను చెప్పుతో కొడతానన్న వ్యక్తి అని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్‌లో భాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ.. సత్యహరిశ్చంద్రుడికి మించిన డ్రామా భూమన సోమవారం తిరుమలలో ఆడాడని దుయ్యబట్టారు. భూమన శ్రీవారి పుష్కరిణిలో మునగడం వల్ల అపవిత్రమైందని.. శ్రీవారి పుష్కరిణిని శుద్థి చేయాలన్నారు. నందికి పందికి తేడా తెలియని వ్యక్తి పొన్నవోలు సుధాకర్ అన్నారు. తిరుమలలో ఎవరు రాజకీయాలు మాట్లాడినా కేసులు పెట్టాలన్నారు. హిందువులంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నచూపు అని భాను ప్రకాష్ ఆరోపించారు.