24.2 C
Hyderabad
Thursday, February 12, 2026
spot_img

ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్

ఏపీలో వరద బీభత్సం పట్ల తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. నటులు, టెక్నీషియన్లు ఎవరికి తోచినంత వారు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. ఇవాళ ఏపీ సచివాలయానికి గ్లోబల్‌ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.

భారీ వర్షాలు, వరదలు విజయవాడపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ప్రముఖుల ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించారు. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విష్వక్సేన్ రూ.5 లక్షలు విరాళంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాల తాలూకు చెక్ లను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. వరద బాధితుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్