సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజా పాలన దితోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 17న అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని తెలిపింది. ఈ మేరకు రేవంత్ సర్కార్ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా వేడుకలు నిర్వహించగా.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించింది. మరోవైపు కేంద్రంలో ఉన్న బీజేపీ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించింది. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఓ మహా ఘట్టం ఆవిష్కృతమైన రోజు. నిజాం నిరంకుశ పాలన నుంచి, రజాకారుల చెరు నుంచి బానిస సంకెళ్లు తెంచుకుని 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో, ప్రజాస్వామ్యంలో ఏకమైన రోజు.