మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. తనకూ కూడా రెడ్ బుక్ ఉందని.. అందులో 100 మందికిపైగా ఉన్నారని అన్నారు.. ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు.. అంటే వారిని కట్టె పట్టుకొని కొడతానని కాదు.. చంపేస్తానని కాదు.. ఖచ్చితమైన ఆధారాలతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమందిపై తప్పుడు కేసులు బనాయించారు.. అలాంటి వారికి ఇప్పుడు ఇబ్బందులు తప్పవన్నారు. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టను అని చెప్పానా? అధికారంలోకి వస్తే.. తోలు తీస్తానని చెప్పాను.. అదే తరహాలో ఉంటానన్నారు. ఒక్కొక్కరికి లెక్కకి లెక్క చెబుతాను అని చెప్పా.. చెప్పి తీరుతా అన్నారు అఖిలప్రియ.