28.2 C
Hyderabad
Monday, May 4, 2026
spot_img

అమెరికా టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. టెక్సాస్‌ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో రోడ్డు ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా.. మరొకరు తమిళనాడు వాసి. ఐదో రోజుల కిందట చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన ఆర్యన్‌ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్‌ పాలచర్ల, తమిళనాడుకు చెందిన దర్శిని వాసుదేవన్‌ ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కార్‌ పూలింగ్‌ ద్వారా ఈ నలుగురు బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు ఒకే వాహనంలో ఎక్కారు. వరుసగా 5 వాహనాలు ఒకదానినొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డల్లాస్‌లో బంధువును కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్‌ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్సిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్‌ ఈ కారులో ఎక్కారు. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోవడంతో కార్‌ పూలింగ్‌ యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. వీరి మృతిపై స్నేహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Latest Articles

ట్రంప్‌ ప్రజాదరణ కోల్పోతున్నారా?.. పని తీరుపై ప్యూ సర్వే ఏం చెబుతోంది?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనితీరు, చురుకుదనం , ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటి అంశాలపై క్రమంగా ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్