24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

సినిమా బాగుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారు: నాని

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. 15 రోజులు గా టీంలో ఎవరికీ నిద్రలేదు. అప్పుడు పని చేసే ఒత్తిడితో నిద్ర లేదు. ఈ మూడు రోజులు గా సక్సెస్ ఎక్సయిట్మెంట్ తో నిద్రలేదు. రిలీజ్ రోజు నుంచి ఎన్నో అభినందనలు, ప్రసంశలు వస్తున్నాయి. సినిమాని మీరంతా ఆదరిస్తాని తెలుసు. థియేటర్ లో అందరితో కలసి ఆడియన్స్ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువగా అంచనా వేశామనిపించింది. సినిమా బావుంటే తెలుగు ఆడియన్స్ తలమీద పెట్టుకుంటారని మరోసారి ప్రూవ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంత వర్షం లో కూడా అన్నీ చోట్ల హౌస్ ఫుల్స్ అవుతున్నాయంటే వి హేవ్ గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ది వరల్డ్. ఆడియన్స్ అందరికీ థాంక్స్. మా టీం అందరి తరపున ఆడియన్స్ కి థాంక్స్ చెప్పడానికి కలిశాం. ‘సరిపోదా శనివారం’ నాట్ వీకెండ్ ఫిల్మ్.. ‘సరిపోదా శనివారం’ హియర్ ఫర్ లాంగ్ కాల్. లాంగ్ రన్ వుండబోతోంది. హెవీ రైన్స్ వుండి ఈ వీకెండ్ చూడలేకపోతే ఎలా ని భయపడకండి, సినిమా మీ చూట్టే వుంటుంది. మీ దగ్గరలోనే వుంటుంది, ఎప్పుడు కుదిరితే అప్పుడు చూడండి. చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ ఇది. సాయి కుమార్, శివాజీ రాజా గారు చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఒక సోల్ యాడ్ చేశారు. బాయ్స్ కి ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది. ఎస్జే సూర్య గారి పెర్ఫర్ఫార్మెన్స్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరికి కంటే ముందు సెట్ లో ఆయన పెర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేశాను. ఆయనకి బిగ్ థాంక్స్, వివేక్ విషయంలో చాలా ప్రౌడ్ గా వుంది. అంటే సుందరానికీ రావాల్సిన బాక్సాఫీసు సక్సెస్ రాలేదనే చిన్న వెలితి వుండేది. అది కాస్త ‘సరిపోదా శనివారం’తో బ్యాలన్స్ అయిపొయింది. దానయ్య గారితో రెండో సినిమా ఇది. నిన్ను కోరి చాలా స్పెషల్ మూవీ. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’. నెక్స్ట్ టైం సినిమా చేసినప్పుడు అంచనాలు ఎక్కువగా వుంటాయి. అలాంటి సెటప్పే చేద్దాం. గట్టిగా కొడదాం. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి ఆడియన్స్ స్పెషల్ గా చెబుతున్నారు. డీవోపీ మురళి గా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎడిటర్ కార్తిక్ కి బిగ్ థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. సెప్టెంబర్ 5న ‘సరిపోదా శనివారం’ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ వుంటుంది. ‘సరిపోదా శనివారం’ ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం..నెక్స్ట్ శనివారం అలా వెళుతూనే వుంటుంది. మీ అందరి సపోర్ట్, బ్లెస్సింగ్స్ తో వి హేవ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బ్లస్టర్ ఇన్ అవర్ హాండ్స్. థాంక్ యూ ఆల్. ‘అన్నారు.

హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ మాట్లాడుతూ.. ‘సరిపోదా శనివారం’కు ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్స్, సక్సెస్ చాలా థాంక్స్. చారు మీ మనసులో నిలిచిపోతుంది. ఇది నా ఫేవరేట్ క్యారెక్టర్. మీ లవ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలానే వుండాలి, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. 100 డేస్ సక్సెస్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలి. థాంక్ యూ సో మచ్’ అన్నారు.

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. నామీద నాకున్న నమ్మకం కంటే నామీద నాని గారికి వున్న నమ్మకం ఎక్కువ. సగం గడ్డంతో ఇంట్రో సీన్ చేద్దామని చెప్పినప్పుడు మరో ఆలోచన లేకుండా చేసేద్దామని అన్నారు. అంత ఫ్రీడమ్ దొరికింది కాబట్టే ఇలాంటి మంచి సినిమా రాగలిగింది. ఇప్పటివరకూ కొంచెం సాఫ్ట్ రోమ్ కాం సినిమాలే చేశాను. ఇలాంటి స్కేల్ వున్న సినిమాని హ్యాండిల్ చేయగలని నమ్మి బడ్జెట్ పెట్టిన నిర్మాత దానయ్య గారికి థాంక్ యూ. కళ్యాణ్ ఫస్ట్ సినిమాతోనే ఇంత పెద్ద సక్సెస్ కొట్టినందుకు ఆనందంగా వుంది. ప్రియాంక ఈ కథకు భెస్. చారులత క్యారెక్టర్ చాల ఎంజాయ్ చేస్తూ రాశాను. సాయి కుమార్ గారితో ప్రతి సీన్ లో ఎదో ఒక పని చేయిస్తూనే వున్నాను(నవ్వుతూ). శివాజీ రాజా గారు నా లక్కీ ఛార్మ్. ఎస్జే సూర్య గారి పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చాలా అనందాన్ని ఇచ్చింది. నేను రాసినదాని అంటే అద్భుతంగా చేశారు. మురళి శర్మగారితో పాటు అందరికీ పేరుపేరునా థాంక్స్. ఇది టీం ఎఫర్ట్. ఇంత అద్భుతమైన సక్సెస్ ని ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ’ అన్నారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, నాని గారి అభిమానులుకు పేరుపేరునా థాంక్స్ చెబుతున్నాను. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాను. ఈ రోజు రిజల్ట్ కూడా అలానే వుంది. సినిమాని ఇంత బాగా తీసిన వివేక్ కి థాంక్ యూ. నిన్ను కోరి తర్వాత మళ్ళీ మాకు రెండో సక్సెస్ తీసుకొచ్చిన నాని గారికి థాంక్ యూ. ప్రియాంక మోహన్ గారు చాలా బాగా చేశారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ దడదడలాడించారు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ తెలిపారు.

యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ..ఈ శనివారం మా సూర్య చాలా కూల్ గా వున్నాడు. దీనికి కారణం మీరంతా ఇచ్చిన సక్సెస్. ఈ సందర్భంగా అందరికీ థాంక్ యూ. వివేక్ ఓ మంచి సినిమాని అందించాలని అహర్నిశలు కష్టపడ్డాడు. అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. చాలా ఆనందంగా వుంది. నానితో ఇది రెండో సినిమా. త్వరలో హ్యాట్రిక్ వుంటుంది. సూర్యని చూస్తే నా పోలీస్ స్టొరీ గుర్తుకువచ్చింది. మంచి టీంతో చేసిన వండర్ ఫుల్ సినిమా ఇది. నిర్మాత దానయ్య గారికి థాంక్ యూ. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ అన్నారు.

యాక్టర్ శివాజీ రాజా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. నా నలభై ఏళ్ల కెరీర్ లో సినిమా అంటే పిచ్చి వున్న వాళ్ళతో పని చేశాను. నాని గారు, వివేక్, దానయ్య గారు, సూర్య గారు అందరికీ సినిమా అంటే పిచ్చి. అందుకే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

Latest Articles

మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత

హీరో మోహన్‌ బాబు కుంటుంబ రచ్చకు ఇంకా ఫుల్‌ స్టాప్‌ పడలేదు. ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తిరుపతిలో మోహన్‌ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్