ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవని విమర్శించారు మాజీ సీఎం జగన్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ కేడర్ అడ్డుకోవడం సరికాదని ఆరోపించారు. కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే… నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని జగన్ మండిపడ్డారు.