ఆగస్టు 20న తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై.. మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కౌంటర్ ఇచ్చారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వల్లే కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని.. దేశం కోసం త్యాగం చేసిన నేత విగ్రహం పెడితే తప్పేంటని వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి రాజీవ్ విగ్రహం పెడుతున్నామా..? అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న ప్రాంతంలోనే రాజీవ్ విగ్రహం పెడుతున్నామని.. కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కూడా రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామని కేటీఆర్ అనడం సరికాదని.. ఒకసారి కేటీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకున్నవారు.. కాస్త విజ్ఞతతోనే ఆలోచించాలని వీహెచ్ అన్నారు.