27.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్టీ ఆఫీసుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో పీఓ రాహుల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గిరిజన పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం నగరంలోని పోలీస్‌ పెరెడ్ గ్రౌండ్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి స్వాతంత్ర సమరయోదులను సత్కరించారు.

కొత్తగూడెం ప్రగతి మైదాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ విభాగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగించిన ఆయన అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ బెటాలియన్ సిబ్బంది చేత ఎస్పీ రోహిత్ రాజ్ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలతో వచ్చిన స్వాతంత్రాన్ని ప్రజలు స్వేచ్ఛగా అనుభవించడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్ కృషి చేస్తుందన్నారు.

కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సింగరేణి సెక్యూరిటీ టీమ్ ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని సింగరేణి ఎండీ బలరామ్ నాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన కార్మికులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఖమ్మం జిల్లాలో వైరాలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ జాతీయజెండాను ఆవిష్కరించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాకతో వైరాకు కళాకారులు భారీగా తరలిరావడంతో వారితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కళాకారులతో కలిసి నృత్యం చేశారు. స్వాతంత్ర దినోత్సవం నాడే సీఎం రేవంత్ వైరాకి రావడం చాలా సంతోషంగా ఉందని.. తెలంగాణ చరిత్రలో గుర్తుండేలా వైరా వేదికగా రుణమాఫీ జరగడం మరింత ఆనందమని అన్నారు ఎమ్మెల్యే.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ ఆఫీస్, కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయం, నీటిపారుదల శాఖ కార్యాలయాలలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వేడుకల్లో భాగంగా మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 300 దుప్పట్లు, టవళ్లను పేదలకు పంపిణీ చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు, అధికారులు, ప్రజలు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాజకీయ పార్టీల ఆఫీసులపై నాయకులు జాతీయ జెండాలను ఎగరవేశారు. ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం లలిత్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చందర్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను మెడల్స్‌తో సత్కరించారు. ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సంస్థ సీజీఎం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్