ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత పాలకుల నియంత పోకడలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని అన్నారు. ఆంధ్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్య్రం లభించిందని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు. ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నాదని సీఎం అన్నారు. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రను రాజధాని లేకుండా పాలించామని తెలిపారు. అమరావతిలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేశామన్నారు. జీవనాడి పోలవరానికి అంత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు.