27.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

మెడికల్‌ షాపులకు వెళుతున్నారా..! ఒక్క నిమిషం ఆగండి.

అసలే వానాకాలం.. పైగా వివిధ రకాల వ్యాధులు ప్రబలే సమయం. ఇలాంటి వేళ ట్యాబ్లెట్ల కోసం అంటూ మెడికల్‌ షాపులకు వెళుతున్నారా..! ఒక్క నిమిషం ఆగండి.. మీం చెప్పబోయేది మీ కోసమే. మీకు మందులు ఇచ్చే వ్యక్తి.. నిపుణుడైన ఫార్మాసిస్టా కాదా అన్న విషయం మీరెప్పుడైనా గమనించారా ? అక్కడ ఉండే సర్టిఫికెట్ ఒకరిది.. షాపులో ఉండేవాళ్లు మరొకరు అన్న అంశం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ? స్వతంత్ర టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. సొమ్మొకడిది సోకొకడిది అన్న చందంగా దశాబ్దాలుగా సాగుతున్న ఈ వైనం రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీకి దారితీయదా..?

వర్షాకాలం వచ్చిందంటే చాలు అంటు వ్యాధులు, విష జ్వరాలు ప్రబలుతుంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా జలుబో, దగ్గో, జ్వరమో.. ఇలా ఏదో ఒకటి తప్పనిసరిగా వస్తూనే ఉంటుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువమంది ఆధారపడేది, ఠక్కున పరిగెత్తేది మెడికల్ షాపులకేనని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మన వీధిలోనో లేదంటే పక్కనే ఉన్న గల్లీలోనో ఉన్న మందుల షాపుకు వెళ్లడం అక్కడ వారిచ్చే ట్యాబ్లెట్లు తీసుకొని వేసుకోవడం చేస్తుంటాం. అయితే.. మనకు ట్యాబ్లెట్స్ ఇస్తుంది నిపుణుడైన ఫార్మాసిస్టా కాదా అన్న విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? అసలు మందుల షాపులో పనిచేసే అనుభవం, చదువు వాళ్లకి ఉన్నాయా అని ఎప్పుడైనా ఆరా తీశారా ?

ఎప్పుడూ ప్రజల పక్షంగా ఉండే స్వతంత్ర టీవీ మెడికల్ దందాపై నిఘాపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మెడికల్ షాపుల్లో జరుగుతున్న తతంగం అంతా బయటపడింది. ఇంకా చెప్పాలంటే భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి. మందుల షాపులో ఉండే లైసెన్స్ ఒకరిది.. ఆ షాపులు నడిపేది మరొకరు. మళ్లీ అందులోనూ టెన్త్‌, ఇంటర్‌ చదివి ఓ మోస్తరు అనుభవం ఉన్న వాళ్లే ఎక్కువగా కన్పిస్తుంటారు. సర్టిఫికెట్‌లో ఉన్న వ్యక్తి ఎక్కడా అంటే ఒక్కొక్కరూ ఒక్కో సాకు చెబుతున్నారు. మరికొందరైతే అవును సర్టిఫెకెట్ ఇచ్చిన వ్యక్తి ఇక్కడ ఉండరు.. వేరే షాపులు కూడా ఉన్నాయి కదా అంటూ చెప్పుకొస్తున్నారు. లైసెన్స్ హోల్డర్లు, షాపులు నడిపే వాళ్లు ఒక్కరే ఉండడం అన్నది ఎక్కడో ఒకళ్లూ అరా తప్పా.. అన్ని చోట్లా వేర్వేరుగానే కన్పించారు. ఇదే అంశం స్వతంత్ర స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చింది. అయితే.. ఇది కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన అంశం మాత్రమే కాదు.. రాష్ట్రంలో అన్ని చోట్లా సర్వసాధారణంగా కన్పించే విషయమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

సాధారణంగా బీఫార్మసీ చేసిన వారు మెడికల్ షాపులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతోంది మాత్రం దీనికి భిన్నమైనది. సర్టిఫికెట్‌ కలిగిన వాళ్లకు ఇంత మెత్తం ఇస్తామని చెప్పి ఆయా ఓనర్లు సంబంధిత వ్యక్తుల పేర్లతో లైసెన్స్‌లు తీసుకుంటారు. అంటే డిగ్రీ వారిది.. షాపు వీరిది. రాష్ట్రంలో దాదాపుగా 95 శాతం మెడికల్‌ షాపుల్లో ఇదే పరిస్తితి నెలకొందన్న వాదన బలంగా విన్పిస్తోంది. పోనీ, ఈ విషయం డ్రగ్స్‌ కంట్రోల్ అధికారులకు తెలియదా అంటే తెలుసన్న మాటే విన్పిస్తోంది. అప్పుడప్పుడూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నా అవన్నీ ఏదో తూతూ మంత్రంగానే సాగుతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి.

రాష్ట్రంలో ఉన్న ఫార్మాసిస్ట్‌ల సంఖ్య దాదాపు 60 వేలు. మెడికల్ షాపుల సంఖ్య కూడా ఇంచుమించుగా అంతే ఉంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాపులో నిపుణుడైన ఫార్మాసిస్ట్ ఉండాలి. అంటే లైసెన్స్‌ హోల్డర్‌ ఉండడం తప్పనిసరి. పోనీ అలా జరుగుతోందా అంటే అదేమీ లేదు. సర్టిఫికెట్ ఇచ్చిన వ్యక్తి ఇంకెక్కడో ఉంటారు. ఒక వేళ ఇప్పుడు లైసెన్స్ ఉన్న వాళ్లంతా ఆయా షాపుల్లోనే ఉన్నా రెండు షిఫ్టుల్లో పనిచేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

మరి.. దీనికి పరిష్కారం ఏంటి అంటే కొన్ని చూపుతున్నారు నిపుణులు. ఇప్పటికే మందుల షాపులను నడుపుతున్న వారిని, అందులో బాగా చదువుకున్న వారిని గుర్తించి వారికి లైసెన్స్‌లు మంజూరు చేయడం ఒకటి. ఇక, మెడికల్ షాపుల్లో పనిచేస్తూ సైన్స్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి డీ ఫార్మసీ లాంటి కోర్సులు చదువుకునే అవకాశం కల్పించడం చేయాలని కొందరు సూచిస్తున్నారు. కేవలం ఇవే కాదు.. మెడికల్ షాపుల సంఖ్యను ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటూ పోవడం కూడా సరికాదంటున్నారు సామాన్య ప్రజలు. సర్కారు ఇప్పటికైనా ఈ విషయంపై జోక్యం చేసుకొని పరిస్థితి చక్క దిద్దకపోతే రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీకి దారి తీస్తుందన్న వాదన విన్పిస్తోంది. మరి.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Latest Articles

భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా

భారత్‌లో లోక్‌సభ ఎన్నికలపై మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్న వేళ టెక్‌ దిగ్గజం స్పందించింది. భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది. ఇది అనుకోకుండా జరిగిన పోరపాటు అని క్షమించాలని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్