24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

‘ఉషాపరిణయం’ చూసి ఆడియన్స్ అలా అంటుంటే ఆనందంగా ఉంది: డైరెక్టర్ కె.విజయ్‌భాస్కర్‌

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా రూపొందిన మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఉషా ప‌రిణ‌యం’. ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత విజయభాస్కర్‌ మాట్లాడుతూ ‘‘చాలా రోజుల తరువాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా వుంది. నువ్వు నాకు నచ్చావ్‌ తరహాలో వినోదంతో పాటు నువ్వేకావాలి లాంటి టీనేజ్‌ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో వుందని అందరూ అంటున్నారు. చిత్రాన్ని అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మౌత్‌టాక్‌తో ఇది మరింత మందికి చేరువ అవుతుందని నమ్మకం వుంది. కలెక్షన్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వస్తాయి. ఈచిత్రంతో హీరో, హీరోయిన్లకు నాకంటే ఎక్కువ పేరు వచ్చింది’’ అన్నారు.

హీరో శ్రీకమల్‌ మాట్లాడుతూ ‘‘సినిమా చూసిన అందరూ నా నటన, డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. అందరం ఎంతో కష్టపడి సినిమా చేశాం. ఈ రోజు ఫలితం చూస్తుంటే ఎంతో ఆనందంగా వుంది. కలెక్షన్లు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’ అన్నారు.

హీరోయిన్‌ తాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ ‘‘సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుండి చాలా పాజిటివ్‌ స్పందన వచ్చింది. ఓ మంచి చిత్రంలో హీరోయిన్‌గా నటించినందుకు సంతోషంగా వుంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు విజయ్‌భాస్కర్‌ గారికి థ్యాంక్స్’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూసిన తరువాత చాలా రోజుల తరువాత మంచి సంగీతంతో కూడిన పాటలు చూశామని ఎమోషన్‌గా చెబుతుంటే నాకు ఎంతో గర్వంగా వుంది. ఈచిత్రంలో ప్రతి పాటకు చక్కని సాహిత్యం, ట్యూన్స్‌ కుదిరాయి. నా కెరీర్‌లో ఇదొక మరుపురాని చిత్రంగా నిలుస్తుంది’’ అని అన్నారు.

Latest Articles

ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. ఇక ఇందిరాగాంధీ భవన్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్‌ అని పేరు పెట్టారు. 5 అంతస్తుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్