దేశంలో భయానక వాతావరణం నెలకొందని మోదీ టార్గెట్‌గా లోక్‌సభలో విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీలో ఒక్కరే ప్రధాని అయ్యే కలలు కంటున్నారని.. మిగతావాళ్లు కలలు కనాలంటే భయపడుతున్నారని.. దేశం మొత్తం చక్రవ్యూహంలో చిక్కుకుందని ధ్వజమెత్తారు. ట్యాక్స్ టెర్రరిజం ఆపడానికి బడ్జెట్‌లో ఏమీ లేదన్న ఆయన.. మోదీ ప్రభుత్వం వల్ల అదానీ, అంబానీ లాంటి వాళ్లకే ప్రయోజనం ఉందని మండిపడ్డారు. అయితే,.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు స్పీకర్ ఓంబిర్లా


