ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. జగన్ వెంట పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలను దేశ ప్రజలకు తెలిసేలా ఢిల్లీలో బుధవారం జగన్ ధర్నా నిర్వహిస్తారు. మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్ కోరారు. ఏపీలో శాంతి భద్రతలు గతి తప్పాయని, రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరతారని తెలుస్తోంది.