కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి కానుక ఇవ్వబోతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతోష్ అన్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ రైతు రుణమాఫీ విధివిధానాలు విడుదల చేయడం సంతోషకరమని తెలిపారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పిన హరీష్‌రావు… రాజీనామా పత్రంతో ఎక్కడికి వస్తారో చెప్పాలనీ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని… అసత్య ప్రచారాలతో బీజేపీ, బీఆర్ఎస్‌లు పూటగడుపుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన ఉండేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు.


