తెలంగాణలో కుంభవృష్టి కురిసినా విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారుల సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈదురుగాలులకు చెట్లు విరిగిపడే అవకాశం ఉండడంతో.. ముందుగానే వాటిని గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఈదురుగాలు వీచినా.. భారీ వర్షం ముంచెత్తినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ సమీక్ష సమావేశంలో భట్టితో పాటు ఎనర్జీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


