వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ రక్తం పంచుకున్న బిడ్డగానే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డిని మించి పది అడుగులు వేసే బిడ్డగా వైఎస్ రాజకీయ వారసుడు జగన్ అన్నారు. ఇక తాము ఇచ్చిన హామీలు అసాధ్యమైనవని చెప్పి..ఇప్పుడు సన్నాయి నొక్కుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు.


