27.8 C
Hyderabad
Sunday, July 13, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

ఇద్దరు ప్రభుత్వ విప్ లను కోరిన జనసేనాని

తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా ప్రకటించాలని కోరుతూ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నరసా పురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను విప్‌లుగా నియమించాలని కోరినట్లు పవన్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

షాద్ నగర్ డిపోకు కొత్త బస్సులు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ డిపో కేటాయించిన 9 నూతన బస్సులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. వివిధ గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో 9 బస్సులను పునః ప్రారంభించారు. షాద్ నగర్ డిపోలో ప్రయాణికుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

నిరుద్యోగుల మహాధర్నా

హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద డీఎస్సీ నిరుద్యోగుల మహా ధర్నాను చేపట్టారు. మహాధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. 25 వేల మెగా డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేశం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. స్కూల్ అసిస్టెంట్లు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వాహనాలు సీజ్‌

బాపట్ల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల లారీ, స్కార్పియో వాహనాలను తుళ్లూరు పోలీసులు సీజ్ చేశారు. తెల్లవారుజామున ఉద్దండరాయునిపాలెం రీచ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీని స్టేషన్‌కి తరలించకుండా.. నందిగం అనుచరులు స్కార్పియో వాహనాన్ని అడ్డుగా పెట్టారు. లారీతో పాటు స్కార్పియో వాహనాన్ని కూడా పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

అగ్ని ప్రమాదం

నెల్లూరు నగరంలోని కొత్త హాల్‌ సెంటర్‌లోని శ్రీరామ్‌ చిట్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా వ్యాపించడంతో ఆఫీసులోని ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.

జిమ్‌ కోచ్‌ ఆత్మహత్య

మేడ్చల్ జిల్లాలో సెల్ఫీ వీడియో తీసుకుని జిమ్ కోచ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలాజీ నగర్ పరిధిలో ఆనంద్ నగర్ కాలనీకి చెందిన జిమ్ కోచ్ రమేశ్ తొమ్మిదేళ్ల కిందట తన భార్య స్వాతికి విడాకులు ఇచ్చాడు. అప్పటినుంచి రమేష్‌ సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా మనస్థాపం చెందిన రమేష్‌ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

జనగామ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు తన భూమి తనకు కావాలంటూ ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. నర్మెట గ్రామంలో ఉన్న తన భూమిని బీఆర్ఎస్‌కు చెందిన జంగిటి అంజయ్య, మల్లయ్య కబ్జా చేశారని ఆరోపించింది. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.

అనుమానాస్పద మృతి

వరంగల్‌ జిల్లాలో దారుణ హత్య కలకలం రేపింది. వరంగల్‌ బట్టల బజార్‌ వెంకటేశ్వర స్వామి గుడి పక్కన భద్రయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. భద్రయ్య మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

దారుణ హత్య

ప్రకాశం జిల్లా వేములకోట గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రిస్తున్న సమయంలో అత్త నారాయణమ్మను కత్తితో గొంతు కోసి హత్య చేశాడు అల్లుడు శ్రీను.. వేములకోటలో నివాసం ఉంటున్న శీను భార్య, భర్తల మధ్య నెలకొన్న వివాదంతో గతంలో భార్యను చంపిన కేసులో నిందితుడుగా ఉన్నాడని SI వెంకటేశ్వర నాయక్ తెలిపారు.

డివిజన్ బాట కార్యక్రమం

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజా పాలన అందించే దిశగా నేటినుండి రామగుండం కార్పొరేషన్ పరిధిలో డివిజన్ బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి తిరుగుతు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పెన్షన్ల పండగ

ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3000 నుంచి 4000 కు పెంచి సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని తెలిపారు.

పెన్షన్ల పంపిణీ

కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పెన్షన్లను పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుపుతున్నామని అన్నారు. గతంలో అందించే 3000 పెన్షన్ 4000 చేయడమే కాకుండా మూడు నెలల అరియర్స్ తో కలిపి 7000 అందిస్తున్నామని అన్నారు.

ధన్యవాదాలు

ఎన్నికల హామీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లాలో పెన్షన్ దారులకు స్వయంగా పెన్షన్‌ను అందజేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని కోకటివేళ్లతో తొలగించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి మంచి పరిపాలనకు పట్టం కట్టిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్