19.7 C
Hyderabad
Friday, November 22, 2024
spot_img

అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములు…. భూమిపైకి చేరేదెప్పటికి?

అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలిమయ్స్ కు సంబంధించి నాసా కీలక అప్ డేట్ ఇచ్చింది. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు ప్రకటించింది. నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఈ వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి వెళ్లిన సునీతా విలియమ్స్ మరో 48 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది.

బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్యే దీనికి కారణం అని తెలిపింది. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ కూడా ఐఎస్ఎస్ నుంచి తిరిగి రావడం వాయిదా పడింది. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. స్టార్ లైనర్ లోని కొన్ని థ్రస్టర్లు మొదటి దశలో ఊహించని విధంగా విఫలమయ్యాయి. వాటి ఫెయిల్యూర్స్ పై నాసా సమీక్ష నిర్వహించింది. స్టార్ లైనర్ సమస్యల వెనుకున్న కారణాలు ఏంటో ఇప్పటికీ ఇంజినీర్లకు కచ్చితంగా తెలియదని నాసా తెలిపింది.థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించారు. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

వ్యోమగామి విల్మోర్ తో కలిసి జూన్ 5న అంతరిక్షానికి చేరుకున్న సునీతా విలిమయ్స్ తాజాగా వారి తిరుగు ప్రయాణానికి ఇబ్బంది తలెత్తడంతో ల్యాండింగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్ లో భాగంగా ఐఎస్ఎస్‌కు చేరిన సునిత, బ్యారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ, బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు. జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది. కానీ, మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. తాజాగా, వీరి రాక మరో 2 నెలలు ఆలస్యం కానుంది.స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీకైంది. ఈ లీక్ కారణంగా సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. అయితే, సునీతా విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే.. హీలియం గ్యాస్ లీక్ గురించి నాసాకు తెలుసునన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది పెద్ద ముప్పుగా భావించని నాసా.. సునీతా విలియమ్స్‌ను అంతరిక్ష యాత్రకు పంపింది. మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం 45 రోజులు మాత్రమే. ఈ మిషన్ జూన్ 5న ప్రారంభమైంది. దీని ప్రకారం ఇప్పటికే 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం 20 రోజులు మాత్రమే మిగులుంది. ఈలోగా సునీతా విలియమ్స్ భూమికి చేరుకోవాలి. అయితే, స్టార్ లైనర్ సమస్యతో వారి రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తైన తర్వాతే సునీతా విలియమ్స్, విల్మోర్ భూమి పైకి చేరుకునే అవకాశం ఉంది.

Latest Articles

రేవంత్‌రెడ్డి ఓ భూ కబ్జాదారు – హరీష్‌రావు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేవంత్‌ ఓ భూ కబ్జాదారుడని ఆరోపించారు. సంగారెడ్డిలో పర్యటించిన హరీష్‌రావు... ప్రశ్నించే గొంతులపై బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్