సీఎం రేవంత్ రెడ్డిపైన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పైన ఆయన ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని బాంబ్ పేల్చారు. రేవంత్‌కు మద్దతు ఇస్తోంది 26 మంది ఎమ్మెల్యేనని అన్నారు. మిగిలిన 38 మందికి పైగా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డికి ఆయన క్యాబినెట్ పై ఆయనకే విశ్వాసం లేదని ఇద్దరు మంత్రులను మాత్రమే ఆయన నమ్ముతున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ద్వారా మూడు కోట్ల ప్రజాధనం వృధా అయిందని నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డికి ఆయన శాసనసభ్యుల మద్దతు లేదని ప్రలోభాలకు గురి చేసి, బీఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్ఏ లను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.